+91 95819 05907

3 నెలల వేతనాలు ఎన్.హెచ్.ఎం.ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

*3 నెలల వేతనాలు ఎన్.హెచ్.ఎం.ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి*

*కాంట్రాక్ట్ లో ఉన్న వారిని అవుట్సోర్సింగ్ మార్చడం చాలా బాధాకరమని వెంటనే ఔట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్టు కొనసాగి ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్*

*- కుటుంబ పోషణ భారంగా మారింది-*

*వరంగల్ జిల్లా*
*06 డిసెంబర్ 2025*

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత 3 నెలలుగా వేతనాలు రాకపోవడం తో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో ఎన్ హెచ్ ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలలుగా (సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు 2025) వేతనాలు రాలేదు. దసరా, దీపావళి పండుగలు కుటుంబాలతో ఆనందంగా జరుపు కోలేకపోయారు. ఇతర సిబ్బందికి అనగా (డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఎం.ఎల్.హెచ్. పి, ఏ.ఎన్.ఎం.లు, ల్యాబ్ టెక్నీషియన్లు, టీబీ డిపార్ట్మెంట్ లో ఎన్ టి ఈ బి మొదలైనవారు) అందరికీ వేతనాలు రెండు నెలలు సెప్టెంబర్ అక్టోబర్ విడుదల చేశారు మరియు వారికి ప్రతి నెల వేతనాలు వస్తున్నాయి. వేతనాలు రాని వారు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకౌంటెంట్లకు, పబ్లిక్ హెల్త్ మేనేజర్లకు, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్లకు,ఎం.ఎన్.ఓ.లకు, వాచ్మెన్ , స్వీపర్..ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, కాంటిజెంట్ వర్కర్లకు, మాత శిశు సంరక్షణ కేంద్రంలో ఓ.టీ అసిస్టెంట్లకు, ఎన్.సి.డి కౌన్సిలర్లకు, ఆర్. కే.ఎస్.కే.కౌన్సిలర్లకు, బ్లాక్ లెవెల్ అకౌంటెంట్లకు, బస్తీ దవాఖాన ఉద్యోగులకు మూడు జిల్లా లో అనగా భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి ,వనపర్తి జిల్లాలలో స్టాఫ్ నర్స్ లకు, సపోర్టింగ్ స్టాప్ కు మూడు నెలల వేతనాలు ఆపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉండటంతో ఇది ఉద్దేశపూర్వక వివక్ష అని ఉద్యోగుల ఆరోపణ వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ… డిసెంబర్ 11 నుంచి విధులకు హాజరై సేవలు నిలిపివేయనున్నారు. (సమ్మె మొదలు) డిసెంబరు 20 నుంచి పూర్తి స్థాయిలో గైర్హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.

*త్వరగా మూడు నెలల వేతనాలు చెల్లించాలి…*

తక్షణం 3 నెలల బకాయిలు చెల్లించాలి, 1195 జీవో ఔట్సోర్సింగ్ కు సంబంధించి అందులో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను కొందరిని ఔట్సోర్సింగ్ చేశారని వెంటనే ఔట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్టు మార్చాలని ఉద్యోగుల పక్షాన తెలియజేస్తున్నాము. ఐదు రాష్ట్రాలలో ఇప్పటికే కొంతమందిని రెగ్యులరైజ్ చేశారు, ఆ తెలంగాణ రాష్ట్రం వస్తే మన భవిష్యత్తు మారుతుందని అనుకుంటే ఉన్న కాంట్రాక్టు పోస్టులును ఔట్సోర్సింగ్ మార్చడం ఇది కరెక్ట్ కాదని న్యాయం చేయాలని సుప్రీంకోర్టు గైలెన్స్ ప్రకారం 2016 నుంచి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఉద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాను.. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పరిధిలో విధులు నిర్వరి స్తున్నావారికి వేతనాలు చెల్లించకపోతే తమ కుటుంబాలను ఎలా పోషించు కుంటారని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి జాప్యం పునరావృతం కాకుండా చూడాలన్నారు.

*ముఖ్యమైన పనులు స్తంభించే ప్రమాదం…*

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ , ఎన్.హెచ్.ఎం.మిషన్ డైరెక్టర్, పై స్థాయి అధికారులు ఇంకా స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సమస్య త్వరలోనే పరిష్కారం కాకపోతే
క్రిస్మస్ సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు సిస్టమ్ పూర్తిగా కుప్పకూలే అవకాశం ఉంది. ఆరోగ్య శాఖ అధికారులు తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర నాయకులు అభిప్రాయ పడుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !