*పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలోఅయ్యప్ప దీక్షాపరులకు అన్నదానం*
*,నేటి గద్దర్ న్యూస్ గుండాల* మండల కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప పీఠం వద్ద శనివారం స్థానిక పోలీస్ సిబ్బంది అయ్యప్ప మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది స్వయంగా వారే వంటావార్పు చేపట్టి, సుమారు 40 మంది అయ్యప్ప దీక్షాపరులకు అన్నప్రసాదాన్ని వడ్డించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అనంతరం అయ్యప్ప దీక్షాపరులు దాతలైన పోలీస్ సిబ్బందికి ఆ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. దాతలు మాట్లాడుతూ అయ్యప్ప దీక్షాపరులకు ఈ కార్యక్రమం చేపట్టడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, కార్తీక మాసం వచ్చిందంటే అయ్యప్పలు గ్రామంలో తిరుగుతుంటే సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామే దిగి వచ్చినట్టు అనిపిస్తుందని ఉద్వేగంగా తెలిపారు. ఈ భిక్ష కార్యక్రమంలో గురు స్వాములు తౌడోజు సురేష్ స్వామి, వెలిశాల నరేష్ స్వామి, గడ్డం నారాయణ స్వామి, గుండెబోయిన నాగరాజు స్వామి, అయ్యప్ప దీక్షాపరులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









