+91 95819 05907

విప్పలమడకలో గరిడేపల్లి వారసత్వాన్ని కొనసాగించాలి.

విప్పలమడకలో గరిడేపల్లి వారసత్వాన్ని కొనసాగించాలి.

పంచాయితీ ఎన్నికలలో సిపిఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి

సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపు

భారీ ర్యాలీ నిర్వహించిన సిపిఐ(ఎం), బిఆర్ఎస్, జనసేన పార్టీ శ్రేణులు

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మండలం విప్పలమడక గ్రామంలో అమరజీవి కామ్రేడ్ గరిడేపల్లి వెంకటేశ్వర్లు వారసత్వాన్ని కొనసాగించాలని, గ్రామ పంచాయతీ ఎన్నికలలో సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం వి ప్పలమడక గ్రామంలో పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్, జనసేన బలపరిచిన సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంక్షిస్తూ సిపిఐ(ఎం), బిఆర్ఎస్, జనసేన పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం పార్టీ అభ్యర్థులను గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిపించాలని కోరారు. పేద ప్రజల కోసం అమరజీవి గరిడెపల్లి వెంకటేశ్వర్లు తన జీవితాన్ని త్యాగం చేశారని, సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం గరిడేపల్లి వెంకటేశ్వర్లు జీవితకాలం పోరాడారని గుర్తు చేశారు. గరిడెపల్లి చేసిన త్యాగాలు మరువలేనివని, గత 50 సంవత్సరాలుగా సిపిఐ(ఎం) పరిపాలనలో వి ప్పలమడక గ్రామం ఎంతో అభివృద్ధి సాధించిందని, వి ప్పలమడక అభివృద్ధికి సిపిఐ(ఎం) నేత అమరజీవి గరిడేపల్లి వెంకటేశ్వర్లు చెరగని ముద్ర వేశారని అన్నారు. గరిడేపల్లి ఆశయాల సాధనకు బిఆర్ఎస్, జనసేన బలపరిచిన సిపిఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థి ముత్తమాల సంపూర్ణ కత్తేర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. అదేవిధంగా వార్డు మెంబర్లు ముత్తమాల సరిత, ముత్తమాల మేరీ, పత్తిపాటి శాంతకుమారి, ముత్తమాల దేవానందం, ముత్తమాల పుష్పరాజ్, సత్తెనపల్లి మాధవి, ముత్తమాల వెంకటరత్నం, కంచె ఏసుమణి, తెల్లూరి వెంకటి, తాళ్లూరి కుమారిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాణోత్ చంద్రావతి, వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, నాయకులు తోట నాగేశ్వరరావు, బాణాల వెంకట్రావమ్మ, కొంగర సుధాకర్, గుడిమెట్ల మోహన్ రావు, ముత్తమాల విజయరావు, ముత్తమాల సంపూర్ణ, గరిడేపల్లి సుబ్బారావు, రుద్రాక్షల వెంకటాచారి ఎదుల్ల పుల్లయ్య, గరిడేపల్లి పుల్లారావు, కళావతి, కృష్ణకుమారి, గరిడేపల్లి అనిల్, బిఆర్ఎస్ నాయకులు పారుపల్లి నాగేశ్వరరావు, మేడా రాంబాబు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు, సిపిఎం, బిఆర్ఎస్, జనసేన నాయకులు, వందల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !