+91 95819 05907

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు..

ఖమ్మం నగరాభివృద్ధికి అంతర్జాతీయ ప్రమాణాలు..

* మంత్రి తుమ్మల కృషితో రూ.249 మంజూరు
* రూ.90 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ నిర్మాణం మరియు రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం
* పదేళ్లపాటు నిర్వాహణకు సైతం నిధుల మంజూరు
మార్చినాటికి ట్రంక్ లైన్ల నిర్మాణం పూర్తికి మంత్రి తుమ్మల ఆదేశం.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వ్యవసాయ, చేనేత, జౌలి, సహకార మరియు మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనికోసం ప్రణాళిక బద్ధంగా వివిధ శాఖల అధికారులకు నిర్దేశిత లక్ష్యాలను నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వర్షపు నీరు నివాసాలను ముంచెత్తకుండా ఉండేలా స్ట్రార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణం మరియు మురుగునీరు ప్రవాహాలను వేరువేరుగా పైప్లైన్ ద్వారా ఎస్టిపి లకు చేర్చడం లక్ష్యం అన్నారు. వర్షపు నీటి వరద కాలువ రూపంలో మున్నేరుకు చేరేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు వర్షపు నీటి వరద మరియు మురుగునీరు ఒకే కాల్వ ద్వారా చెరువులు,మున్నేరుకు చేరడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని అన్నారు. దీనిని అరికట్టడం కోసం భారీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ఆదివారం నాడు ఖమ్మంలోని 10,11,14, 19,20,21,41సహా పలు వార్డులను ఆయన సందర్శించారు. ప్రణాళిక రూపకల్పన అమలు విధానాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలి..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ దిన దినాభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరాభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తూ అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వపరంగా మంజూరు చేయిస్తున్నట్లు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ చేనేత జౌళి శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని 10వ డివిజన్లో అమృత్ పథకం కింద రూ.249 కోట్లతో భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ పనుల పురోగతిని మంత్రి తుమ్మల పరిశీలించారు. ఆక్రమణలను తొలగించి వీలైనంత త్వరగా పైప్ లైన్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలం నాటికి కాల్వ పనులను సైతం పూర్తిచేసి ముంపు లేకుండా చూడాలి ఖమ్మంలో ముంపు అనే ప్రశ్న తలెత్తకుండా చూడాలని అన్నారు.
ఈ పథకం లో బాగంగా 8.5 కిలో మీటర్ ల మురుగు నీటి పైప్లైన్(ఊర చెరువు నుండి ధంసలాపురం చెరువు వరకు),మురుగు నీటి డ్రైన్ లు అంతర్గత పైప్లైన్లను అనుసంధానం చేసి మురుగునీటి శుద్ధి కేంద్రానికి తరలించనున్నారు. అయితే ధంసలాపురం వద్ద చేపట్టనున్న 44 మిలియన్ లీటర్ ల సామర్ధ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రానికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పుట్టకోటలో 9.5 మిలియన్ లీటర్ ల సామర్ధ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ వి. రంజిత్ , కార్పొరేటర్లు ఆళ్ళ నిరోష అంజిరెడ్డి, చామకూర వెంకటేశ్వర్లు, ఖమ్మం నగర కాంగ్రేస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి , ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !