+91 95819 05907

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

రెండవ విడత పోలింగ్ 91.21 శాతం నమోదు

రెండవ విడతలో 2,26,417 మంది తమ ఓటు హక్కు సద్వినియోగం

కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలించిన జిల్లా కలెక్టర్.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ఖమ్మం జిల్లాలోని 6 మండలాల్లో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతు రెండవ విడత 160 గ్రామ పంచాయతీలకు, 1379 వార్డులకు నిర్వహించిన పోలింగ్ లో 91.21 శాతం మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ఉదయం 9 గంటల వరకు 27.78 శాతం, 11 గంటలకు 64.32 శాతం, 1 గంట వరకు 85.95 శాతం పోలింగ్ నమోదైందని, ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని, వారితో కలిపి మొత్తం ఖమ్మం జిల్లాలో 91.21 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. రెండవ విడత పోలింగ్ నిర్వహించిన కామేపల్లి మండలంలో 87.03 శాతం, ఖమ్మం రూరల్ మండలంలో 93.76 శాతం, కూసుమంచి మండలంలో 90.92 శాతం, ముదిగొండ మండలంలో 91.52 శాతం, నేలకొండపల్లి మండలంలో 91.69 శాతం, తిరుమలాయపాలెం మండలంలో 91.57 శాతం పోలింగ్ నమోదైందని, మొత్తం 2 లక్షల 48 వేల 239 మంది ఓటర్లకు గాను 2 లక్షల 26 వేల 417 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని, మొత్తంగా రెండవ విడతలో 91.21 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కలెక్టర్ అన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కలెక్టరేట్ నుంచి నిరంతరం మానిటరింగ్ చేయడం జరిగిందని, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కౌంటింగ్ ముగిసిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా 6 మండలాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, సిపిఓ ఏ. శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాస రావు, రెవెన్యూ సిబ్బంది,
టెక్నికల్ టీం సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !