+91 95819 05907

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల భూమిని తక్షణం అప్పగించాలి.

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.

ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల భూమిని తక్షణం అప్పగించాలి.

నిర్లక్ష్యం కొనసాగితే ఖమ్మం నుంచే రాష్ట్రవ్యాప్త పోరాటం.

సమస్యల సాధన కోసం ఐక్య ఉద్యమ కార్యాచరణకు సిద్ధం.

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా తృతీయ మహాసభలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య.

టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా టి. సంతోష్ చక్రవర్తి ఎన్నిక.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఖమ్మం, డిసెంబర్ 15
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వంతో రాజ్యాంగ బద్దంగా పోరాడుతామని, అందుకు జర్నలిస్టులంతా ఐక్య కార్యాచరణకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ ఎప్పటికీ జర్నలిస్టుల పక్షానే నిలుస్తుందనీ, పాలకుల పక్షం కాదని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణే ధ్యేయంగా సమస్యలపై పోరాడుతుందని పేర్కొన్నారు.
ఆదివారం ఖమ్మంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా తృతీయ మహాసభ ఘనంగా జరిగింది. జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ టి. సంతోష్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా సంఘం బాధ్యులు, సభ్యులు సంఘ నియమ నిబంధనలకు లోబడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, స్థానిక జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వృత్తిలో నైపుణ్యత, పనిలో పట్టుదల, క్రమశిక్షణతో కర్తవ్యాలు నిర్వర్తించడం ద్వారా సంఘ ప్రతిష్టను మరింత పెంచాలని ఆయన కోరారు. సంఘాన్ని దెబ్బతీసేలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తప్పులు చేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులపై కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాం జర్నలిస్టుల సమస్యలను నిర్లక్ష్యం చేశాయని, అదే బాటలో ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ‘పాత్రికేయుల పోరు యాత్ర’ చేపట్టక తప్పదని హెచ్చరించారు. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ ఒక్క మీడియా సంస్థకు అనుబంధం కాదని, జర్నలిస్టులందరికీ చెందిన సంఘమని పునరుద్ఘాటించారు. భయపడకుండా ధైర్యంగా సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ మహాసభలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్లు వల్లాల జగన్, తన్నీరు శ్రీనివాస్, కుడితాడు బాపురావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి.రాజేందర్, పాల్వాయి జానయ్య, గుండె బోయిన వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు. ఖమ్మం జిల్లా ఫెడరేషన్ నాయకులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్, అంతోటి శ్రీనివాస్, వందనపు సామ్రాట్, లీగల్ అడ్వయిజర్ పసుపులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన కమిటీ ఎన్నిక.

ఖమ్మంలో జరిగిన తృతీయ మహాసభలో టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా టి. సంతోష్ చక్రవర్తి, కార్యదర్శిగా నానబాల రామకృష్ణ, కోశాధికారిగా అర్వపల్లి నగేష్, ఉపాధ్యక్షులుగా అంతోటి శ్రీనివాస్, మందడపు మనోహర్, వేల్పుల నాగేశ్వర రావు, సంయుక్త కార్యదర్శులుగా కొదుమూరి భద్రయ్య, కుంభం రవి కుమార్ లు ఎన్నికయ్యారు. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా అమరబోయిన ఉపేందర్, కాసోజు శ్రీధర్, కప్పల మధు, కందబోయిన నాగకృష్ణ, వేములకొండ రమేష్, మల్లెల శిల్ప, నైని స్వాతి తదితరులు ఎన్నికయ్యారు.వీరితో పాటుగా నేటి గదర్ జిల్లా స్టాఫర్ సతీష్ కుమార్ జినుగు పాల్గొన్నారు.

తెలంగాణ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీబీజేఏ) జిల్లా అధ్యక్షుడిగా వందనపు సామ్రాట్ గుప్తా ఎన్నికయ్యారు.

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ తీర్మానాలు.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పరిహారం మాదిరిగానే, మృతి చెందిన జర్నలిస్టులకు కూడా రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి తక్షణమే అమలు చేయాలని, జర్నలిస్టుల పిల్లలకు సాధారణ ప్రైవేట్ పాఠశాలల నుంచి ఇంటర్నేషనల్ పాఠశాలల వరకు ఉచిత విద్యా సదుపాయం కల్పించాలని కోరుతూ, మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మూతపడిన ఇండిపెండెంట్ జర్నలిస్టుల సైట్‌ను వెంటనే తెరిపించి, గతంలో అర్హత పొందిన లిస్టులో ఉన్న జర్నలిస్టులందరికీ బేషరతుగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, భౌతిక భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసింది. అలాగే రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని, అపరిష్కృతంగా ఉన్న ఇండ్లస్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రభుత్వంతో సత్వర చర్చలు చేపట్టాలని, జర్నలిస్టులకు న్యాయ రక్షణ సెల్ ఏర్పాటు చేయాలని, అన్ని కమిటీలలో మహిళా జర్నలిస్టులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులు రాత్రి వేళ ఇంటికి చేరుకునే సమయంలో రవాణా భద్రతను ప్రభుత్వం తప్పనిసరిగా కల్పించాలని ఈ మహాసభ గట్టిగా డిమాండ్ చేసింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !