మేము పార్టీ కోసమే పని చేసినం …
* మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు సంజీవరెడ్డి కి లేదు…
మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు పాషా..
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
11 వ తేదీన జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకే నడుచుకున్నాను అంటున్న ముస్లిం మైనార్టీ చింతకాని మండల అధ్యక్షులు పాషా మంగళవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
వందనం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డ అభ్యర్థి తరపున పని చేశాను తప్ప పార్టీకి ఎలాంటి నష్టం కలిగే విషయాలు నేను చేయలేదని తెలిపారు. పోటీ చేయొలని ఆలోచనతో నామినేషన్ దాఖలు చేసి అధిష్టానం ఆదేశం మేరకు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాను. అప్పటినుండి కాంగ్రెస్ పార్టిపార్టీ తరపున నిలబడ్డ వ్యక్తికే సపోర్ట్ చేసి ఆయన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పని చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు షేక్ మోయిన్, కోరిపల్లి పున్నయ్య, తదితరులు పాల్గొన్నారు.









