+91 95819 05907

ఖమ్మం జిల్లాలో పరిశ్రమల విస్తరణకు వేగవంతమైన చర్యలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

ఖమ్మం జిల్లాలో పరిశ్రమల విస్తరణకు వేగవంతమైన చర్యలు… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
మంగళవారం రఘునాథపాలెం మండలం జింకల తండా, పువ్వాడ నగర్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ (టిజిఐఐసి) కు కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. పరిశ్రమలు నెలకొల్పడానికి స్థలం అనుకూలమైన పరిస్థితులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కేటాయించిన భూమి యొక్క విస్తీర్ణం, సరిహద్దులు, రహదారి అనుసంధానం, మౌళిక సదుపాయాల లభ్యతను సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రస్తుతం ఉన్న మొత్తం స్థలంను సేత్వార్, కాస్రా, నక్షా మ్యాప్ లను ఆధారంగా సమగ్రంగా సర్వే చేసి సరిహద్దులు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాను పరిశ్రమలకు అనుకూల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నదని, టిజిఐఐసి ద్వారా కేటాయించిన భూములను సమర్థవంతంగా వినియోగించి ఆర్థిక అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మైనింగ్ ఎడీ సాయినాథ్, పరిశ్రమల శాఖ జీఎం సీతారాం నాయక్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !