పాలేరు నియోజకవర్గంలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన
– కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన ప్రజాప్రతినిధులను కలవనున్న మంత్రి
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం (రేపు) పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలుస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అందరూ సకాలంలో హాజరుకావాలని కోరారు.
అదేవిధంగా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు కూడా మంత్రి అందుబాటులో ఉంటారని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు.









