+91 95819 05907

జమ్మిగూడెంలో బిఆర్ఎస్ క్లీన్ స్వీప్: మాజీ ఎమ్మెల్యే మెచ్చాను కలిసిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు

జమ్మిగూడెంలో బిఆర్ఎస్ క్లీన్ స్వీప్: మాజీ ఎమ్మెల్యే మెచ్చాను కలిసిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 16: అశ్వారావుపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. అధికారంలో లేకపోయినా బెదిరింపులు, దౌర్జన్యాలను ఎదుర్కొని మండలంలోని 7 పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో జమ్మిగూడెం పంచాయతీలో సర్పంచ్‌గా ఘనవిజయం సాధించిన ముద్దిన వెంకట నర్సమ్మ, ఉప సర్పంచ్ డండి వెంకటేశ్వరరావు మరియు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు దానపు రాజమ్మ, మిద్దిన రాంబాబు, దానపు భాగ్యరాజు, గణప పుల్లమ్మ, రెడ్డి జ్యోతి, సోమిని రాజ్యలక్ష్మి లు గెలిచిన రెండు రోజుల అనంతరం మంగళవారం మండల నాయకులు కాసాని చంద్రం ఆధ్వర్యంలో అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావును దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెం గ్రామంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు గెలిచిన అభ్యర్థులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసి అఖండ విజయాన్ని అందించిన నాయకులను, కార్యకర్తలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు ముద్దిన కొండయ్య, ముద్దిన రాములులతో పాటు నాయకులు రాజిని నాగేశ్వరావు, దానపు జగపతి, పెన్నాడా చిట్టిబాబు, నక్కా సూరిబాబు, ముద్దిన వెంకటేశ్వరావు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !