ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు….. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.
ఖమ్మం జిల్లా పరిధిలో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా పరిధిలో 566 గ్రామ పంచాయతీలకు 566 సర్పంచ్, 566 ఉప సర్పంచ్, 5168 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొన్న ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించారని, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు రాకుండా కట్టుదిట్టంగా ఎన్నికలను నిర్వహించిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Post Views: 18









