+91 95819 05907

రైతులు సాలోభ్యం కోసమే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్: ఎస్ విజయ్ చంద్రం

రైతులు సాలోభ్యం కోసమే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్: ఎస్ విజయ్ చంద్రం

నేటి గదర్ చింతకాని ప్రతినిధి:

రైతుల సాలభ్యం కోసమే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ మధిర వ్యవసాయ సంచాలకులు ఎస్ విజయ్ చంద్రం అన్నారు. శుక్రవారం మండల పరిధిలో చింతకాని కొదుమూరు పర్యటించారు. ఈ సందర్భంగా విజయచంద్రం మాట్లాడుతూప్రస్తుత యాసంగి సీజన్లో యూరియా కొనుగోలు చేయుటకు వ్యవసాయ శాఖ తీసుకువచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ గురించి వివరించారు. గత వాన కాలంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యాప్ ను అమలులోకి తీసుకురావడం జరిగింది అని వివరించారు. రైతులు ఈ యాప్ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియాను వారి యొక్క పంటను బట్టి వారికున్న విస్తీర్ణాన్ని బట్టి జిల్లాలో ఏ డీలర్ అయినా ఏ సొసైటీలో అయినా అందుబాటులో ఉన్న యూరియాను బుక్ చేసుకోవచ్చని అని అన్నారు. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల లోపు ఆ రైతు బుక్ చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయవచ్చు అని . ఏదైనా పరిస్థితులలో 24 గంటల లోపు యూరియాను తీసుకోనట్లయితే ఆ యొక్క బుకింగ్ రద్దు అవుతుంది అని మళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని సూచించారు. అదేవిధంగా పట్టాదారులు, పట్టా పుస్తకాలు లేని వాళ్ళు మరియు కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు అవకాశం ఉందని అన్నారు .ఈ యొక్క యాప్ ను రైతులకు అలవాటు చేయటానికి మరియు అవగాహన కల్పించడానికి ప్రతి ఔట్లెట్ దగ్గర వ్యవసాయ శాఖ ద్వారా ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది లేదా సంబంధిత ఏఈ ఓ రైతులకు సహాయం చేయడం జరుగుతుంది అని సూచించారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క యాప్ను వినియోగించుకొని యూరియాను కొనుగోలు చేయవచ్చు అని సూచించారు. ఈ క్రింద తెలిపిన లింకు ద్వారా యాప్ను ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సోములపల్లి మానస, సొసైటీ సీఈవో మారగని శ్రీనివాస రావు, వ్యవసాయ విస్తరణ అధికారులు తేజ, ఆయేషా మరియు రైతులు పాలొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !