+91 95819 05907

మీడియా పట్ల వివక్ష సరికాదు– సమస్యలపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి.

మీడియా పట్ల వివక్ష సరికాదు– సమస్యలపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి.

-పెండింగ్ లో ఉన్న ఇండిపెండెంట్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల అంశంలో తగు చర్యలుండాలి.

-డి.పి.ఆర్.ఓ ఎమ్.ఏ.గౌస్ కు టిడబ్ల్యూజెఎఫ్ (H-2843) ఖమ్మం జిల్లా అధ్యక్షులు టీ.ఎస్. చక్రవర్తి వినతి.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

మీడియాను నిర్లక్ష్యం చేయరాదని, అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు సకాలంలో మంజూరు చేయాలని, గతంలో అక్రిడిటేషన్ పొందినవారికి రెన్యూవల్ ప్రక్రియను సులభతరం చేయాలని, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్
(TWJF – H-2843) ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి.ఎస్.చక్రవర్తి కోరారు. ఖమ్మం జిల్లా లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, టి.డబ్ల్యూ.జె.ఎఫ్ (H-2843) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎమ్.ఏ.గౌస్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టి.ఎస్.చక్రవర్తి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వం– ప్రజల మధ్య కీలక వారధిగా పని చేస్తున్నారని తెలిపారు. అయితే అక్రిడిటేషన్, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రకటనల విషయంలో జర్నలిస్టులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రకటనల జారీలో చిన్న, మధ్య, పెద్ద పత్రికల మధ్య ఎలాంటి భేదభావం చూపకూడదని స్పష్టం చేశారు.

అలాగే చిన్న, మధ్యస్థాయి పత్రికలకు, ప్రభుత్వ ప్రకటనల పంపిణీలో న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రకటన బిల్లులను వెంటనే చెల్లించాలని, డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో అమలు చేసి ఆరోగ్య భద్రత కల్పించాలని, విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, భరోసా చర్యలు అమలయ్యేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గతంలో దరఖాస్తు చేసుకుని, పెండింగ్‌లో ఉన్న ఇండిపెండెంట్ జర్నలిస్టుల సైట్‌ను రీ–ఓపెన్ చేసి, సీనియారిటీ నష్టపోతున్న అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కమిటీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ జర్నలిస్టు కార్డులు మంజూరు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇకనైనా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కావాల్సి వస్తుందని టిడబ్ల్యూజెఎఫ్ హెచ్చరించింది. ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారి ఎమ్.ఏ. గౌస్ సానుకూలంగా స్పందిస్తూ, జర్నలిస్టుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్ ఖమ్మం జిల్లా సెక్రటరీ నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నాగేష్, జిల్లా ఉపాధ్యక్షులు అంతోటి శ్రీనివాస్, మందడపు మనోహర్, వేల్పుల నాగేశ్వర రావు, టీ.బీ.జే.ఏ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా,
కార్యవర్గ సభ్యులు అమరబోయిన ఉపేందర్, కాసోజు శ్రీధర్, కప్పల మధు, కందరబోయిన నాగకృష్ణ, మామిడాల కిరణ్, పొదిలాపు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !