+91 95819 05907

ఘనంగా వై.ఎస్. జగన్ 54వ జన్మదిన వేడుకలు

ఘనంగా వై.ఎస్. జగన్ 54వ జన్మదిన వేడుకలు

​ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట (రిపోర్టర్: దాది చంటి ) డిసెంబర్, 21: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ములకలపల్లి మండలం జగన్నాధపురం మరియు దమ్మపేట మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలకు అశ్వరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ వీరాభిమాని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య సోయం వీరభద్రం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, మరియు సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ అభిమానులు సోయం కృష్ణ, బొల్లిపల్లి సురేష్, లోకేంద్ర, సురభి సత్యం, వాసు, హరీష్, తాటి రమణ, దారా యుగేంధర్, పాకనాటి శ్రీను, చారుగుండ్ల ప్రదీప్ కుమార్, అన్నారపు నాగేంద్ర కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో జగనన్న అభిమానులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !