+91 95819 05907

జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.

జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025’ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో (G.O.Ms.No.252) జారీ చేసింది.

కొత్త నిబంధనల ముఖ్యాంశాలు:

1. అక్రెడిటేషన్ కమిటీల కాలపరిమితి:

రాష్ట్ర స్థాయి (SMAC) , జిల్లా స్థాయి (DMAC) అక్రెడిటేషన్ కమిటీల పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించారు. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాతవే కొనసాగుతాయి.

2. అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డు:

• అక్రెడిటేషన్ కార్డు: ఇది ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు గుర్తింపుగా ఉపయోగపడుతుంది.

• మీడియా కార్డు: డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే ఈ కార్డులు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందేందుకు మాత్రమే పనికివస్తాయి.

3. డిజిటల్ మీడియాకు తొలిసారి నిబంధనలు:

డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రెడిటేషన్ ఇవ్వాలంటే సదరు వెబ్‌సైట్‌కు గత ఆరు నెలల్లో నెలకు కనీసం 5 లక్షల మంది విజిటర్స్ (Unique Visitors) ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మీడియా కేటగిరీలో గరిష్టంగా 10 కార్డులు మాత్రమే ఇస్తారు.

4. ఎలిజిబిలిటీ క్రైటీరియా:
• న్యూస్ పేపర్లు: కనీసం 2,000 ప్రతులు పంపిణీ అవుతున్న దినపత్రికలే అక్రెడిటేషన్‌కు అర్హులు. PRGI రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

• ఎలక్ట్రానిక్ మీడియా: శాటిలైట్ ఛానళ్లు 50% వార్తా కంటెంట్‌ను కలిగి ఉండాలి. లోకల్ కేబుల్ ఛానళ్లు రోజుకు కనీసం 3 బులెటిన్లు టెలికాస్ట్ చేయాలి.

• జర్నలిస్టుల అర్హత: స్టేట్ లెవల్ అక్రెడిటేషన్ కోసం డిగ్రీ విద్యార్హత లేదా ఐదేళ్ల అనుభవం ఉండాలి.

•నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి.

5. ఫ్రీలాన్స్ & వెటరన్ జర్నలిస్టులు:
15 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్సర్లు, 30 ఏళ్ల అనుభవంతో పాటు 58 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు కూడా కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కమిటీల నిర్మాణం:
• రాష్ట్ర కమిటీ (SMAC): మీడియా అకాడమీ చైర్మన్ చైర్మన్‌గా, ఐఅండ్‌పిఆర్ కమిషనర్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో వివిధ జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులు, పీసీఐ సభ్యులు ఉంటారు.

• జిల్లా కమిటీ (DMAC): జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీపీఆర్వో మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

నిబంధనల ఉల్లంఘన జరిగితే:
అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా, తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కార్డులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. పోగొట్టుకున్న కార్డుల స్థానంలో డూప్లికేట్ కార్డు కోసం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !