భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమం.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
భారత రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పాల్గొన్నారు.
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ,హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ , పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, పలువురు పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , నగర ప్రముఖులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Post Views: 26









