గొర్రెలు,మేకల నట్టల నివారణ మందులు పంపిణీ.
సర్పంచ్ కిలారు మనోహర్,వెటర్నరీ డాక్టర్ రాంజీ.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల కేంద్రంలో మంగళవారం నాడు గొర్రెలకు,మేకలకు నట్టల నివారణ మందులను చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు ప్రారంభించారు.గొర్రెల,మేకలు లో వచ్చే ఈ నట్టలను సాధ్య మైనంత త్వరగా సరైన సమయంలో మందులు అందించాలని సూచించారు.గొర్రెల లో వచ్చే అంపిటోమ్స్ రకపు నట్టలను పొట్ట జలగలు,ఎర్ర నట్టలు,ఎర్ర పురుగులు అని వివిధ రకాలుగా పిలుస్తారు అని,గొర్రెల జీర్ణ వ్యవస్థలో ఏర్పడి బరువు తగ్గడానికి,రక్తహీనత,తిన్న ఆహారం అరగక,దవడల కింద నీరు రావడం,వేరేచనలు వంటి లక్షలు ఉంటే వెంటనే దగ్గరలోని పశు వైద్యశాల వద్దకు వెళ్ళి నట్టల నివారణ మందులు అందించాలని డాక్టర్ రాంజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పొనుగోటి వెంకటేష్,కొప్పెరా శ్రీను మరియు చింతకాని పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









