+91 95819 05907

కొత్త మేడేపల్లి గ్రామ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి..బానోతు మంజుల మదన్ లాల్

కొత్త మేడేపల్లి గ్రామ గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి..బానోతు మంజుల మదన్లాల్.

నేటి గదర్ న్యూస్, వైరా/ ఏన్కూరు:
ఏన్కూర్ మండల పరిధిలోని మేడేపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉన్న కొత్త మే డేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న గుత్తి కోయ గిరిజనుల సమస్యలను వెం టనే ప్రభుత్వం పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు బానోతు మంజుల మదన్ లాల్ డిమాండ్ చేశారు.కొత్త మేడిపల్లి గ్రామాన్ని బిఆర్ఎస్ మండల నాయకులతో కలిసి బానోతు మంజుల మదన్లాల్ సందర్శించారు. అక్కడ వారు నివాసం ఉన్న ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న గుత్తి కోయ కుటుంబాలను కలుసుకొని వారు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు.అక్కడ ఉన్న గిరిజనులు మా గ్రామంలో కరెంట్ లేకపోవడంతో అష్ట..కష్టాలతో..రాత్రి వేళ చీకట్లో కునారీళ్లుతూ బాధ లు పడుతున్నామని..మాకు ఈ సమస్యను తీర్చమని ఆమెను గిరిజనులు అడగగా..వెంటనే స్పందించిన బానోతు మంజుల మదన్ లాల్ త్వరలో ఎని మిది సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేస్తానని వారికి హామీ నిచ్చారు.గతం లో బానోతు మదన్ లాల్ ఉన్నప్పుడు మా గ్రామానికి బోరు కావాలని దరఖా స్తు పెట్టుకుంటే వెంటనే..స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి మా గ్రా మానికి బోర్ వేయించినారు అని ఆమె దృష్టికు గిరిజనులు తీసుకొచ్చారు. మా గ్రామములో అనేక సమస్యలు ఉన్నా గాని అధికారులు మాత్రం పట్టిం చుకోవడం లేదని ఆమె దృష్టికి తీసుకొచ్చారు.మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆమె ముందు మొర పె ట్టుకున్నారు.అధికారులకు ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్నా గాని స్పందించడం లేదని గిరిజనులు ఆమె ముందు వాపోయారు.గిరిజనులు పడుతున్న బాధ లను విని బానోతు మంజుల మదన్ లాల్ చెలించి పోయారు.త్వరలోనే మీ గ్రామ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసు కువెళ్లి సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని వారికి హామీని ఇచ్చారు.ఈ సందర్భంగా బానోతు మంజుల మదన్ లాల్ మాట్లాడుతూ..ప్రభుత్వ అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి..గుత్తి కోయ గిరిజనులు పడుతున్న బాధలను అర్థం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు.ఈ కార్య క్రమంలో బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు,నాయకులు మల్లెంపాటి మాధవరావు,చీట్ కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ విజయ కుమారి,అజ్మీర నరసింహారావు,రవి రైలు,నరసింహారా వు,ముదిగొండ గారునాగేశ్వరరావు రమేష్ శివ గౌడ్ నరసరావు ,ముత్తయ్య,గణేష్ బాబు బుల్లయ్య బండ కృష్ణ గడ్డం వెంకటేశ్వర్లు ,తదితరులు పాల్గొ న్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !