+91 95819 05907

ఐద్వా జాతీయ మహాసభకు వేలాదిగా కదిలి రండీ.

ఐద్వా జాతీయ మహాసభకు వేలాదిగా కదిలి రండీ.

జనవరి 25-28 వరకు 14వ జాతీయ మహాసభలు

జనవరి 25న హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ

నేటి గదర్ న్యూస్, వైరా:
2026 జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాద్ లో నిర్వహించే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, జాతీయ మహాసభ సందర్భంగా జనవరి 25న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు వేలాదిగా మహిళలు కదిలి రావాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ఐద్వా వైరా డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గవీటి సరళ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మొదటిసారి ఐద్వా జాతీయ మహాసభ జరుగుతుందని తెలిపారు. జనవరి 25న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి మహిళలు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. నాలుగు రోజులపాటు హైదరాబాద్లో జరిగే మహాసభలో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించి, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందిస్తామన్నారు. మహిళల భద్రత, మహిళల చట్టాలు, హక్కులు, విద్య, బాల్య వివాహాల నిషేధం, ఆస్తి హక్కు చట్టం, వరకట్న వేధింపుల నిరోధానికి ఐపీసీ 498 ఏ సెక్షన్, కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్, గృహా హింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు వంటి అనేక సమస్యలపై దేశవ్యాప్తంగా ఐద్వా అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని, మహిళలు, యువతులపై వేధింపులు, హత్యలు, లైంగిక దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా జాతీయ మహాసభకు జాతీయ నాయకులు బృందాకారత్, అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి టీచర్, మరియం దావలె, జాతీయ నాయకులు ఎస్.పుణ్యవతి, సుధా సుందర రామన్ తోపాటు దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఐద్వా జాతీయ మహాసభ విజయవంతం కోసం సెమినార్లు, సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. మహాసభ విజయవంతానికి ప్రజలందరూ ఆర్థిక, హార్దిక సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ, వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, ఐద్వా సీనియర్ నాయకురాలు మచ్చా మణి, తాతా పద్మ, పెద్దమళ్ళ పద్మ తిలకం, తాళ్లపల్లి విజయ, బాణాల వెంకట్రావమ్మ, కంసాని మల్లికాంబ, కెసగాని నీలిమ, మెకల స్వరూపా రాణి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !