+91 95819 05907

సేవాభావంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

సేవాభావంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

​ఎన్ఎస్ఎస్ క్యాంపులతో సామాజిక బాధ్యత పెంపొందుతుంది -అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, డిసెంబర్, 27: విద్యార్థి దశ నుంచే సేవాభావం, సామాజిక బాధ్యతను అలవర్చుకోవడం వల్ల ఉన్నతమైన పౌరులుగా ఎదుగుతారని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు. మండలంలోని పాతనారంవారిగూడెంలో అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని ఎమ్మెల్యే అన్నారు. ఇలాంటి సేవా శిబిరాల ద్వారా విద్యార్థులకు క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, అక్షరాస్యత వంటి అంశాలపై గ్రామస్థుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూనే, సమాజ హితం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రజలకు ఉపయోగపడేలా విద్యార్థులు చేస్తున్న సేవలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుమ్మా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, సర్పంచ్ మునుగొండ నాగమణి పాల్గొన్నారు. వీరితో పాటు కళాశాల అధ్యాపక బృందం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !