నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి, సగ్గుర్తి ముత్యాల రావు
మధిర మున్సిపల్ నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన భట్టి విక్రమార్క, ప్రజలకు మెరుగైన సేవలందించే ఆధునిక కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. మధిర చరిత్రాత్మక పట్టణంగా గుర్తింపు పొందిందని, సర్దార్ జమలాపురం కేశవరావు, నల్లమల గిరి ప్రసాద్ లు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే పోరాడారని గుర్తుచేశారు.
మహానగరంగా మధిర అభివృద్ధి దిశగా రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పేదల కోసం జి+2 అపార్ట్మెంట్లు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అభివృద్ధి, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
మెప్మా ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించే చర్యలు చేపడుతున్నామని, రాజకీయాలు అతీతంగా మధిర అభివృద్ధికి అందరూ కలసి కృషి చేయాలని పిలుపునిచ్చారు
Post Views: 30









