+91 95819 05907

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు ఉపాధ్యాయులే: ఎమ్మెల్యే జారే

​గండుగులపల్లి హెచ్‌ఎం రాయల హనుమంతరావు పదవీ విరమణ వేడుక ఘనం

నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, డిసెంబర్, 31: సమాజ భవిష్యత్తును నిర్మించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే శిల్పులు వారేనని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయల హనుమంతరావు పదవీ విరమణ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ముఖ్య అతిథిగా హాజరై, హనుమంతరావు దంపతులను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే అత్యంత గౌరవప్రదమైనదని కొనియాడారు. హనుమంతరావు తన సుదీర్ఘ సర్వీసులో అనేక తరాల విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చి, గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు. కేవలం పాఠ్యాంశాలే కాకుండా నైతిక విలువలు, దేశభక్తిని పెంపొందించడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా తన అనుభవాన్ని విద్యా రంగానికి అందిస్తూ మార్గదర్శకుడిగా కొనసాగాలని ఆకాంక్షించారు. హనుమంతరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పాఠశాలలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని ఉపాధ్యాయ బృందం పేర్కొంది. విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడారు. గ్రామాభివృద్ధిలోనూ ఆయన చురుగ్గా పాల్గొనేవారని గ్రామ పెద్దలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !