+91 95819 05907

వృద్ధుల చెంతకు ‘బిర్రం’ వెచ్చని సాయం: నూతన సంవత్సర వేళ మానవీయత

దిబ్బగూడెంలో దుప్పట్ల పంపిణీ.. ప్రతి ఏటా సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ముందడుగు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) జనవరి, 01: కొత్త సంవత్సరం వేళ ఆడంబరాలకు పోకుండా, పేద ప్రజల ఆకలి తీరుస్తూ, చలిలో వణికే వృద్ధులకు అండగా నిలవడమే నిజమైన పండుగని నిరూపించారు అశ్వారావుపేట మండలం వినయకపురం గ్రామానికి చెందిన రైతు బిడ్డ బిర్రం వెంకటేశ్వరరావు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా గురువారం మండలంలోని దిబ్బగూడెం గ్రామ పంచాయతీలో గిరిజన వృద్ధులకు ఆయన దుప్పట్లు పంపిణీ చేశారు. తన మనవళ్లు, మనమరాల పుట్టినరోజులైనా, పండుగలైనా గిరిజన గ్రామాల్లోని పేదలకు చీరలు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడం వెంకటేశ్వరరావుకు ఒక ఆనవాయితీ. ఈ ఏడాది కూడా కటిక చలిలో ఇబ్బంది పడుతున్న వృద్ధులను గుర్తించి, వారికి వెచ్చని దుప్పట్లు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిబ్బగూడెం గ్రామ సర్పంచ్ పండా రాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వృద్ధులతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తమ కష్టాలను గుర్తించి ఏటా సాయం అందిస్తున్న బిర్రం వెంకటేశ్వరరావు కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గిరిజన వృద్ధులు ఆశీర్వదించారు. తమ అవసరాలు తీరుస్తూ నిరంతరం అండగా ఉంటున్నందుకు గ్రామ ప్రజలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !