+91 95819 05907

అనారోగ్యంతో బాధపడుతున్న సున్నం సత్యనారాయణను పరామర్శించిన రేగా కాంతారావు, మెచ్చ నాగేశ్వరరావు

అశ్వారావుపేటలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యేలు.. మాజీ జెడ్పిటిసి కుటుంబానికి భరోసా

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్ : దాది చంటి) జనవరి 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మరియు అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు శుక్రవారం అశ్వారావుపేట పట్టణంలో పర్యటించారు. పట్టణానికి చెందిన మాజీ జెడ్పిటిసి సున్నం నాగమణి భర్త సున్నం సత్యనారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నేతలు మధ్యాహ్నం 4 గంటలకు వారి నివాసానికి చేరుకుని సత్యనారాయణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నేతలు, ధైర్యంగా ఉండాలని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని ఆకాంక్షించారు. పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వారు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంపూర్ణ, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఉపాధ్యాయుల ప్రకాష్, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, మాజీ జెడ్పిటిసి జూపల్లి రమణారావు పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ నాయకులు కాసాని చంద్రమోహన్, మందపాటి రాజమోహన్ రెడ్డి, సంక ప్రసాద్, వగ్గెల పూజ, జె. శ్రీరామ్ మూర్తి, బుక్య ప్రసాద్, నారం రాజశేఖర్, రఘురాం, దమ్మపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ రమేష్ మరియు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !