+91 95819 05907

దమ్మపేట తహసీల్దార్ కార్యాలయానికి ఎమ్మార్వోను కేటాయించాలి: బీజేపీ డిమాండ్

మంత్రి సొంత మండలంలోనే ఈ దుస్థితా? తక్షణమే తాహిసీల్దార్ ను నియమించాలని డిమాండ్

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి పూర్తిస్థాయి ఎమ్మార్వోను కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కీలకమైన దమ్మపేట మండలంలో గత కొంతకాలంగా ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా రైతులు తమ పనుల కోసం కార్యాలయం చుట్టూ తిరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ బాధ్యతలు చేపట్టిన అధికారులు వచ్చిన కొద్ది రోజులకే బదిలీపై వెళ్లడం లేదా ఇతర ప్రాంతాలకు మారిపోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలో, అందునా రాష్ట్ర మంత్రి సొంత మండలంలోనే ఇలాంటి దుస్థితి నెలకొనడం శోచనీయమని వారు ధ్వజమెత్తారు. ఉన్నత స్థాయి అధికారులు, పాలకులు వెంటనే స్పందించి దమ్మపేట కార్యాలయానికి శాశ్వత ప్రాతిపదికన ఎమ్మార్వోను నియమించి పాలనను పట్టాలెక్కించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి, సీనియర్ నాయకులు గొట్టిపూళ్ల శ్రీనివాసరావు, కొలీకపోగు ముసలయ్య, పసుపులేటి నాగరాజు, సోయం వెంకట్, మహిళా నాయకులు కారం రత్నకుమారి, ఆళ్ల సుజాత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !