+91 95819 05907

ఈర్ల కృష్ణవేణికి మార్పు స్వచ్చంధ సంస్థ చేయూత

నేటి గదర్ న్యూస్, వైరా:
మార్పు స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ బజార్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మహిళా ఈర్ల కృష్ణవేణికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న ఈర్ల కృష్ణవేణి భర్త ఈర్ల రమేష్ కీడ్నీ వ్యాదితో బాధపడుతూ ఇటీవల కాలంలో మరణించారు. భర్త అకాల మరణంతో కుటుంబ పోషణకు, ఇద్దరు ఆడపిల్లలను చదివించడానికి ఈర్ల కృష్ణవేణి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని సిపిఐ(ఎం) వైరా శాఖ సభ్యులు ద్వారా తెలుసుకున్న మార్పు స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత శుక్రవారం స్వయంగా కృష్ణవేణి ఇంటికి వెళ్ళి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేటి సామాజిక పరిస్థితులలో ఒక మహిళ ఒంటరిగా కుటుంబ బాధ్యతలు మోయడం, ఇద్దరి ఆడ పిల్లలను చదివించడం చాలా కష్టమైన విషయం అన్నారు. చిన్న సహాయం కూడా ఆపదలో ఉన్నవారికి చాలా ఉపయోగ పడుతుందని, మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి ఈర్ల కృష్ణవేణి కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గుడిమెట్ల మోహనరావు, సిపిఐ(ఎం) వైరా శాఖ కార్యదర్శి ఓర్పు సీతారాములు, శాఖా సభ్యులు వల్లెపు ఏడుకొండలు, దేవళ్ళ క్రిష్ణ, బత్తుల ప్రమీల, దేవళ్ళ మంగ, బండారి మేఘన తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !