+91 95819 05907

రామన్నగూడెం సమస్యలపై కలెక్టరుకు ‘మొర’

* అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విన్నపం
* రేషన్ కార్డులు, మీ-సేవా కేంద్రం ఏర్పాటుపై వినతి
* సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 02: అశ్వారావుపేట మండలంలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ మడకం నాగేశ్వరరావు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు జటిలమైన సమస్యలను ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రామంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ కోరారు. అదేవిధంగా, కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేద ప్రజలకు నెలలు గడుస్తున్నా కార్డులు మంజూరు కాలేదని, దీనివల్ల వారు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామన్నగూడెం కేంద్రంగా చుట్టుపక్కల 6 గ్రామాలకు అందుబాటులో ఉండేలా ఒక ‘మీ-సేవా’ కేంద్రాన్ని మంజూరు చేయాలని విన్నవించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి ప్రహరీ గోడ నిర్మాణం, ప్రధాన రహదారుల నుంచి కార్యాలయం వరకు సీసీ రోడ్ల ఏర్పాటు, అంగన్వాడీ మరియు గిరిజన పాఠశాలల వద్ద కల్వర్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరారు. అలాగే, రహదారులకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని తొలగించి స్పీడ్ బ్రేకర్లు మరియు వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. అక్రమ ఇసుక, మట్టి రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టరుకు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. సర్పంచ్ వివరించిన సమస్యలపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని, పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడకం నాగేశ్వరరావుతో పాటు ఉప సర్పంచ్ కోర్స కళ్యాణి, మాజీ సర్పంచ్ మడకం స్వరూప, వార్డు మెంబర్లు మోడియం రమాదేవి, సోరేం రవి, మడకం కన్నారావు, చింతం వెంకన్నబాబు, మాడి దుర్గ, పేసా కార్యదర్శి మాడి సీతారాముడు మరియు రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 200 మంది ప్రజలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !