*
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) జనవరి 3.
మాసాయిపేట మండలం లోని హకీంపేట గ్రామనికి నూతనంగా బీటీ (డంబార్) రోడ్డు ఏర్పాటు చేశారు. మాసాయిపేట మండల కేంద్రం నుంచి అచ్చంపేటకు వెళ్లే ప్రధాన రహదారి నుంచి హకీంపేటకు నూతనంగా రోడ్డు మంజూరైంది. రెండు రోజుల క్రితం నూతనంగా బీటీ రోడ్డును హకీంపేటకు వేశారు. నూతనంగా రోడ్డు వేయడంతో గ్రామస్థులు ఇన్ని సంవత్సరాలుగా నెరవేరని కల ఇప్పుడు నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే రోడ్డు కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి నా ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని గ్రామస్తులు తెలిపారు.
Post Views: 117









