*
రామంతపూర్ సర్పంచ్ భవాని సౌందర్య రఘుపతి.
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) జనవరి 3.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని రామంతపూర్ గ్రామ నూతన సర్పంచ్ భవాని సౌందర్య రఘుపతి మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిపించినందుకు మా గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. నన్ను ఆదరించి ఆశీర్వదించి గెలిపించిన మా గ్రామ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పింఛన్లు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించేందుకు నా శాయశక్తుల కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రామంలో పరిష్కరించాల్సిన సమస్యలను ముందుగా పరిష్కరిస్తానని నాపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు అందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 25









