*
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) జనవరి 3.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం లోని నడిమితండాలో ‘ఉజ్వల’ పథకం కింద 9 మంది లబ్ధిదారులకు సర్పంచ్ కేతావత్ రాములు నాయక్ శనివారం ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. నూతన రేషన్ కార్డు కలిగిన మహిళలకు తూప్రాన్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా మంజూరయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వాతి శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 15









