+91 95819 05907

ఐద్వా ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 195 జయంతి

సావిత్రిబాయి స్పూర్తితో మహిళల హక్కుల కోసం పోరాడాలి.

మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాము

ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, సినీయర్ నాయకురాలు మచ్చా మణి.

నేటి గదర్ న్యూస్, వైరా:-
చదువుల తల్లి సావిత్రి భాయి పూలే స్ఫూర్తితో మహిళల హక్కుల కోసం పోరాడాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి భాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, ఐద్వా సినీయర్ నాయకురాలు మచ్చా మణి అన్నారు. శనివారం వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సావిత్రి భాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి తోట కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన సభలో ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, సీనియర్ నాయకురాలు మచ్చా మణి మాట్లాడుతూ సావిత్రి భాయి పూలే సంఘం సంస్కర్తగా, ఉపాధ్యాయినిగా, రచయిత్రిగా నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన యోధురాలు అన్నారు. మహిళల విద్య ద్వారా సమాజంలో మార్పు వస్తుందని బలంగా నమ్మిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే అన్నారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందని, కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి శూద్రుల, అస్పృశ్యుతకి వ్యతిరేకంగా మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా భావించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత ప్రజలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకరిణి అన్నారు. స్పూర్తితో మను వాదానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3 మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా పట్టణ నాయకులు కంసాని మల్లికాంబ, చావా కళావతి, మాదినేని రజిని, భూక్యా విజయ, మాడపాటి సుజాత, తాటి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !