ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం బిజెపి రాష్ట్ర నాయకులు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిపై కూనంనేని సాంబశివరావు వాడిన భాష అత్యంత దురదృష్టకరం. కనీస సంస్కారం లేకుండా మాట్లాడటం వారి నైతిక పతనానికి అద్దం పడుతోంది.
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు గౌరవంగా చూస్తున్న తరుణంలో, ఇక్కడి నాయకులు ఇలాంటి నీచమైన విమర్శలు చేయడం దేశ ప్రతిష్టను దిగజార్చడమే. రాజకీయ ఉనికి కోసం మోదీ గారిని తిట్టడం మానకపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారు అని అన్నారు.
Post Views: 14









