+91 95819 05907

జిల్లా పెన్షన్స్ సంఘ నాయకుల హౌస్ అరెస్ట్.

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :

మండలపరిధిలోని నాగులవంచ గ్రామానికి చెందిన రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటిశాంతయ్యను,పాతర్లపాడు గ్రామానికి చెందినరిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ కంచుమర్తి
పుల్లయ్యను వారి ఇళ్ల వద్ద నిద్రలోనే హౌస్ అరెస్టు చేసినారు. జిల్లా పెన్షనర్ సంఘ బాధ్యులైన వారిద్దరిని సోమవారం హైదరాబాదులో జరిగేచలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఉండేందుకు వారిని అరెస్టు చేయడం జరిగింది. చింతకాని ఎస్సై వీరేంద్ర నాయకత్వంలో
చింతకాని పోలీసులు
అరెస్టు చేసినారు. వీరి అరెస్టు పట్ల రాష్ట్ర పెన్షనర్ సంఘం కన్వీనర్ కోహెద్ చంద్రమౌళి, కో కన్వీనర్ జయరాం, జిల్లా కన్వీనర్ మారుతి రామారావు, పి. ఆర్. టి. యు, యు.టి.ఎఫ్, ఏ.పీ.టీఎఫ్ సంఘాలు, జిల్లా పెన్షనర్ సంఘాలు ఖండించాయి. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా 39 సంవత్సరాలు కష్టపడి పని చేసినారని ,వారు దాచుకున్నటువంటి గ్రాటివిటీ, కమిటీ షన్, జిపిఎఫ్ ,ఈ ఎల్ ఎన్కాష్ మెంట్ వంటివి ఇవ్వకుండా, దరిదాపురిటైర్మెంట్ 24 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు వివరించారు. రిటైర్మెంట్ అయిన మరుసటి రోజునే ఇవ్వవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 24 నెలలు గడిచిన ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. 63 సంవత్సరాల వయసులో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడకక్కడ అరెస్టు చేయటం మంచి పద్ధతి కాదని వారు తెలిపారు .ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఏకకాలంలో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !