నేటి గదర్ కరకగూడెం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఇర్ప గీత ఆరోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెంటనే మూడు లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కును మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇర్ప గీత ఆరోగ్య పరిస్థితి గురించి కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పినపాక ఎమ్మెల్యే దృష్టికి తిసుకెళ్ళడంతో వెంటనే ఎల్ఓసి చెక్కను మంజూరు వేయించిన పినపాక ఎమ్మెల్యే పాయం కు మండల అధ్యక్షులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 13









