+91 95819 05907

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై అశ్వరావుపేట బీఆర్ఎస్ యువజన నేత మోటూరి మోహన్ తీవ్ర ఆగ్రహం

నేటి గద్దర్ న్యూస్,​అశ్వరావుపేట, జనవరి, 05: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను అశ్వరావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మోటూరి మోహన్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, కోట్ల మంది గుండెల్లో కొలువైన దైవమని ఆయన పేర్కొన్నారు. సోమవారం అశ్వరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో మోహన్ మాట్లాడుతూ.. “నేను కేసీఆర్ గారి కూతురిని, ఏ మాటలైనా అనేస్తాను అంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేమీ చిల్లర వ్యక్తులం కాదు. నిండు శాసనమండలి సాక్షిగా ‘ఏం పీకి కట్టలు కట్టారు’ అని బాపును ఉద్దేశించి మాట్లాడటం నీ అహంకారానికి పరాకాష్ఠ. నిన్ను కన్న తండ్రి, రాష్ట్ర సాధకుడు అయిన కేసీఆర్ గారిని విమర్శించడానికి నీకు సిగ్గు, శరం లేదా?” అని నిలదీశారు. ​​లిక్కర్ స్కామ్ కేసు నుండి తనను తాను కాపాడుకోవడానికి కవిత నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని మోహన్ ఆరోపించారు. “కేసుల నుండి తప్పించుకోవడానికి ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలకు మోకరిల్లుతున్నావు. నీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బురదలో ఉన్న పెండ తిని కూడా బ్రతుకుతావు అని నీ ప్రవర్తన ద్వారా అర్థమవుతోంది” అని ఘాటైన విమర్శలు చేశారు. ​తమ నాయకుడు కేసీఆర్ గారికి 60 లక్షల మంది కార్యకర్తల సైన్యం అండగా ఉందని, ఒక పవిత్ర యోధుడి కడుపున కవిత లాంటి “చీడపురుగు” పుట్టడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ని విమర్శించే స్థాయి కవితకు లేదని, తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !