నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు
బనిగండ్లపాడుకు చెందిన పూర్వ కళాశాల విద్యార్థి మరియు ప్రస్తుతము మధిర పట్టణంలో అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపారవేత్త శ్రీ కోన ఈశ్వర్ గారు ఈరోజు బనగాండ్లపాడు విద్యార్థులచే మీనవోలులో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శీతాకాల శిబిరానికి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి వ్యాపారవేత్తలుగా భావి భారత పౌరులుగా స్వచ్ఛంద సేవకులుగా ఎలా ఎదగాలో తన జీవితాన్ని సోదాహరణంగా వివరిస్తూ చైతన్య పరిచారు విద్యార్థులకు పెన్నులు మరియు నూనె సామాగ్రి అందించారు కళాశాల ప్రధానాచార్యులు శ్రీ రవి కుమార్ గారు ప్రసంగిస్తూ కోనా ఈశ్వర్ గారి సేవలను కొనియాడారు అనంతరం కళాశాల మొత్తం సిబ్బంది కోన ఈశ్వర్ గారిని ఘనంగా సన్మానించారు
Post Views: 10









