నేటి గదర్ న్యూస్, వైరా నియోజకవర్గ ప్రతినిధి /కొణిజర్ల :-
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు ఏడవ తేదీ ( బుధవారం) నాడు ఉదయం 10:30 గంటలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచులు , ఉపసర్పంచ్ లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందనీ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పోట్ల శ్రీనివాసరావు , మాజీ జెడ్పిటిసి కవిత తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కే టీ ఆర్) హాజరవుతున్నారని వారు తెలిపారు. కావున కొణిజర్ల మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచ్ ల, వార్డు మెంబర్లు , మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా వారు కోరారు.
Post Views: 72









