+91 95819 05907

పేద విద్యార్థులు చదువుకోలేరు… చదువు కోనుక్కోవాలి

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని పోరాడుతాం

సావిత్రిబాయి స్ఫూర్తితో శాస్త్రియ విద్యా విధానం కోసం ఉద్యమిస్తాం

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

హైదరాబాదులో జనవరి 25 నుంచి 28 వరకు జాతీయ మహాసభలు

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ యం.మమత

నేటి గదర్ న్యూస్, వైరా:-
భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో నూతన విద్యా విధానం – 2020 పేరుతో విద్యారంగంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా శాస్త్రియ విద్యా విధానం కోసం ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ యం.మమత పిలుపునిచ్చారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగంపై జరుగుతున్న దాడిని అరికట్టాలని, పేద కుటుంబాల విద్యార్థులు చదువు కోనుక్కోని చదువుకోలేరని, కులవృత్తులు చేసుకుని బ్రతకాల్సిన పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఐద్వా వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “నూతన విద్యా విధానం – నేటి సవాళ్లు” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్రపటానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.నవీన జ్యోతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా వైరా డివిజన్ నాయకురాలు మచ్చా మణి అధ్యక్షతన జరిగిన సెమినార్ లో యం.మమత మాట్లాడుతూ నూతన విద్యా విధానం – 2020 పేరుతో జరుగుతున్న విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నాడు మనువాదం, మూఢాచారాలకు వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే పోరాటం సాగించారని, మహిళల చదువు కోసం, సమానత్వం కోసం, హక్కుల కోసం సావిత్రి భాయి పూలే జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పుల కోసం ఆమె తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసి పోరాడిన విధానం నేటి మహిళలందరికీ ఆదర్శనీయం అన్నారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని, కళాశాలల ఫీజులు భారీగా పెంచుతున్నారని తెలిపారు. దీనివలన ప్రభుత్వ విద్యా రంగం, బాలికల విద్య ప్రమాదంలో పడుతుందని, ఇటువంటి చర్యలతో సమాజంలో మహిళల విద్యాభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ఐద్వా లక్ష్యాలైన స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సమానత్వం, మహిళా విముక్తి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. మహిళలంతా సమిష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలని సూచించారు.‌ హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని యం.మమత పిలుపునిచ్చారు. జనవరి 25న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ మహాసభలు ‘సామ్రాజ్యవాదాన్ని ఎదిరించండి – మనువాదాన్ని ఓడించండి – మహిళా హక్కులను కాపాడండి’ అనే నినాదంతో సాగుతాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగే ఐద్వా జాతీయ మహాసభలు, బహిరంగ సభకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రవీన్, ఐద్వా డివిజన్ సహాయ కార్యదర్శి తోట కృష్ణవేణి, ప్రభుత్వ జూనియర్ కళాశాల స్టాప్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !