+91 95819 05907

జనం చెంతకు. ఎమ్మెల్యే జారే

​జనం చెంతకు జారె ఆదినారాయణ: గురువారం అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ‘ప్రజా బాట’!

​లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.. విద్యుత్ ప్రమాద బాధితులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్న ఎమ్మెల్యే జారే

నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 08: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 7:30 గంటలకు దమ్మపేట మండలంలోని గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీతో పర్యటన ప్రారంభం కానుంది. అనంతరం 8 గంటలకు దిబ్బగూడెం-బాలరాజుగూడెం ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన ప్రీ-ప్రైమరీ స్కూల్ భవనాన్ని ప్రారంభించి, 9 గంటలకు అశ్వారావుపేటలో ‘సీఎం కప్’ టార్చ్‌ను ఘనంగా ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు వెంకట్రాజుగూడెం-అఖినేపల్లిలో నిర్వహించే ‘విద్యుత్ ప్రజా బాట’ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా, ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మరణించిన జుజుమ్ బంగారావు అశ్వారావుపేట, తంగేళ్లమూడి పోలయ్య రంగువారిగూడెం కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి, ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ వట్టి వెంకట్రావు కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !