నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ పెన్షన్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్యఎంపికైనారు.స్వతగా రాజకీయ నేపథ్యమున్న కుటుంబంనుంచివచ్చినఅంబటిసామాజికసేవాకార్యక్రమాలలోముందుండేవాడు.ఉపాధ్యాయ సమస్యల మీద, రిటైర్డ్ ఉపాధ్యాయుల సమస్యల మీదపోరాటాలుచేసినారు .హైదరాబాద్ ధర్నాలతో పాటు జిల్లా కేంద్రాలలో జరిగే ధర్నాల్లో కూడా చురుకుగా పాల్గొనడంతో రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నామినేట్ చేసింది. తన ఎంపికకుసహకరించినటువంటి రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు మధు గారికి ,ప్రధాన కార్యదర్శి వెంకట నరసయ్య గారికి ,జిల్లా అధ్యక్షులు వై వి గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు. రిటైర్ అయినటువంటి పెన్షనర్ సమస్యల మీద తాను దృష్టి
పెట్టివాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని అంబటి తెలిపారు.









