+91 95819 05907

రైతు సంక్షేమమే ధ్యేయం.. అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం!

అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన శుక్రవారం స్థానిక వ్యవసాయ కళాశాలలో రైతు సంక్షేమమే లక్ష్యంగా భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో బాలికల నూతన హాస్టల్ భవనానికి, సి.సి. రోడ్ల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ యాంత్రీకరణ పథకం, జాతీయ సహజ వ్యవసాయ మిషన్‌ను అధికారికంగా ప్రారంభించడంతో పాటు, ఆధునిక భూసార పరీక్షా కేంద్రం మరియు మొక్కల విశ్లేషణ ప్రయోగశాలను జాతికి అంకితం చేశారు. సహజ వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకుని, ఉత్పాదకతను ఎలా పెంచుకోవాలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘రైతు మేళా’లో రైతుల సమస్యలను నేరుగా విన్న ఎమ్మెల్యే మరియు మంత్రులు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీఓ బి. రాహుల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ సభలో, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రైతుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !