+91 95819 05907

పుర పోరుకు సిపిఐ(ఎం) పార్టీ సిద్ధం

ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో సత్తా చాటిన సిపిఐ(ఎం)

రానున్న ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి.

సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు.

నేటి గదర్ న్యూస్, వైరా:-
పురపాలక సంఘాల ఎన్నికలకు సిపిఐ(ఎం) పార్టీ సిద్ధంగా ఉందని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు, ముఖ్యుల జనరల్ బాడీ సమావేశం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో వైరా డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన సిపిఎం పోరాడుతుందని అన్నారు. సిపిఎం పార్టీ ప్రజల్లో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్దతతో పని చేయటం, పేద వర్గాల ప్రజలు, మహిళలు, రైతులు, కూలీలు, కార్మికులు, యువజనులు, విద్యార్థుల సమస్యలపైన నిరంతరం పనిచేయడం వలన ప్రజల్లో పార్టీ బలం పెరిగిందని తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిపిఎం తన సత్తాను చాటిందని, అధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచారని అన్నారు. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో సిపిఐ(ఎం) సత్తా చాటి 26 సర్పంచులు, 33 ఉప సర్పంచ్ లు, 387 వార్డు మెంబర్లును గెలిచిందని గుర్తు చేశారు. నిస్వార్ధంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఐ(ఎం)ను రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, వైరా రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బోడేపూడి వీరభద్రం, పారుపల్లి చంద్రశేఖర్ బాబు, షేక్ జమాల్ సాహెబ్, మందడపు రామారావు, మల్లెంపాటి రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, చావా కళావతి, మాడపాటి మల్లికార్జునరావు, మాడపాటి వెంకటేశ్వరరావు, మాడపాటి రామారావు, తాటి ఏసు, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, శాఖ సభ్యులు, ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !