+91 95819 05907

వైరాలోనే ఆర్టీవో కార్యాలయాన్ని కొనసాగించాలి.

ఆర్టీవో కార్యాలయం వద్ద సిపిఎం(ఎం) నిరసన

బోనకల్‌కు మార్చితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం హెచ్చరిక.

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి దినేష్ కు వినతి

నేటి గదర్ న్యూస్, వైరా :-
వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు విశేషంగా సేవలు అందిస్తున్న వైరా ఆర్టీవో కార్యాలయాన్ని వైరా నియోజకవర్గ కేంద్రంలోనే కొనసాగించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. వైరా ఆర్టీవో బోనకల్ కు మార్చితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఆర్టీవో కార్యాలయాన్ని బోనకల్ కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీవో కార్యాలయం వద్ద సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి.దినేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు . ఈ సందర్భంగా పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా వైరా కేంద్రంగా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా సేవలందిస్తున్న రవాణా శాఖ కార్యాలయాన్ని వైరా నుంచి మధిర నియోజకవర్గం బోనకల్‌కు మార్చాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వైరాలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా కార్యాలయాన్ని బోనకల్ కు తరలించడాన్ని సిపిఐ(ఎం) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. నిర్ణయం వల్ల వైరా, కొణిజర్ల, తల్లాడ, ఎన్కూరు మండలాల ప్రజలకు రవాణా సేవలు అందనంత దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బోనకల్ మండల కేంద్రంలో ఆర్టీవో కార్యాలయం ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆదేశాల మేరకు గురువారం బోనకల్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వెనుక ఉన్న స్థలాన్ని వైరా ఎంవిఐ వరప్రసాద్, తహసిల్దార్ రమాదేవి, యుడిసి ఉపేందర్ పరిశీలించారని తెలిపారు. బోనకల్ కు కొత్త ఆర్టీవో కార్యాలయం మంజూరు చేయాలని సూచించారు. వైరాలో ఉన్న రవాణా శాఖ కార్యాలయాన్ని వైరాలోనే కొనసాగించాలని కోరారు. బోనకల్ కు మార్చడం వల్ల వేలాది మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి, నాయకులు గుడిమెట్ల రజిత, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, మందడపు రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, మాడపాటి రామారావు,
యనమద్ది రామకృష్ణ, అమరనేని
కృష్ణ, పానుగంటి రాంబాబు, మాడపాటి వెంకటేశ్వరరావు, మాడపాటి సుజాత, చావా కళావతి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !