కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి!
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం కావాలని, అశ్వారావుపేట పురపాలక గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహుమతిగా ఇవ్వాలని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం అశ్వారావుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే అశ్వారావుపేట ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందని, ప్రజల చిరకాల కోరిక మేరకు కేటీఆర్ సహకారంతోనే ఈరోజు అశ్వారావుపేట మున్సిపాలిటీగా రూపుదిద్దుకుందని గుర్తుచేశారు. సెంట్రల్ లైటింగ్, 100 పడకల ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్, ఆర్టీఓ కార్యాలయం, డిగ్రీ కళాశాల వంటి ఎన్నో మైలురాళ్ళు బీఆర్ఎస్ పాలనలో సాధించినవేనని స్పష్టం చేశారు. కానీ గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క తట్టెడు మట్టి కూడా పోసిన దాఖలాలు లేవని, పైగా గతంలో తాను మంజూరు చేసిన పనులలో నాణ్యత లేకుండా చేస్తూ ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. 100 రోజుల్లో హామీలంటూ ప్రజలను వంచించిన కాంగ్రెస్ తీరును ఇంటింటికీ వెళ్లి వివరించాలని, సమన్వయంతో పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జజ్జూరు వెంకన్న బాబు, దొడ్డ రమేష్, సత్యవరపు సంపూర్ణ టౌన్ పార్టీ అధ్యక్షులు, జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి మాజీ ఎంపీపీ,ఫణీంద్ర మాజీ వైస్ ఎంపీపీ,చిక్కం గోపి యువ నాయకుడు, యుఎస్ ప్రకాష్ రావు, మోహన్ రెడ్డి, సంక ప్రసాద్, కాసాని చంద్ర మోహన్, వగ్గెల పూజ, గూడవర్తి వెంకటేశ్వరరావు, జజ్జరపు శ్రీరామ్ మూర్తి, గోవిందు, నక్క రాంబాబు, తాళం సూరి, వెంకన్న, బజారయ్య, శ్రీను, నార్లపాటి చిన్నబ్బాయి, ఉస్మాన్, రాహిమున్, తగరం బేబీ, సోమాని రమేష్, కలపాల సురేష్, ఆసిఫ్, రెహమాన్, మోటురి మోహన్, నరేంద్ర, ముకుందారావు, రాంబాబు, బుజ్జి బాబు, తగరం హరి, అమీర్, జజ్జురపు రాంబాబు, చరణ్, బాలి కిరణ్, సంతోష్, ఏసు, భరత్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.









