+91 95819 05907

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్:
విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన మసీదు అనంతరం ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ బోనకల్ మండల అధ్యక్షులు షేక్. మహబూబ్ పాషా అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ ధార్మిక సభలో పలువురు వక్తలు మాట్లాడారు. తొలుత షేకూల్ హదీస్ జామియా ఇస్లామియా ఇషా తుల్ ఉలూమ్అక్కలకోవా (మహారాష్ట్ర ) మౌలానా విశ్వనుద్దీన్ సాహెబ్  మారుఫీ మాట్లాడుతూ పలు ఉపమానాలతో విశ్వాసం నమాజ్ సదాచారాలు మానవుల మోక్షానికి మార్గాలుగా ఉపయోగపడతాయి అన్నారు. మసీదు నిర్మాణానికి సహకరించిన సహాయపడిన లేకున్నా మసీదు నిర్మాణం పరిపుష్టి గావించేందుకు నమాజులు ఆచరించాలన్నారు.తెలుగు ప్రసంగికులు
నాజిమా జామియా రెహమాన్ p బనాద్ అమరావతి ( ఆంధ్రప్రదేశ్ ) మౌలానా అబ్దుల్ ముస్తా ఆన్ సాహెబ్ మాట్లాడుతూ మసీదులు కేవలం నమాజులకు మాత్రమే పరిమితం కాదని అవి మనలోని సోదరా భావాన్ని ,మన ఐక్యమత్యాన్ని, మన విశ్వాసాన్ని చాటి చెప్పే కేంద్రాలని అభివర్ణించారు. గ్రామ సీమలలో బహు దైవారాధన ( షి ర్క్) వంటి సామాజిక సమస్య పెరగకుండా అరికట్టడానికి , మన వ్యక్తిత్వానికి మెరుగుపరిచేందుకు, ధార్మిక విద్యను అందించడానికి  పిల్లల తల్లిదండ్రులు మసీదులకు
ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్. ముజాహిద్ఇశాతి మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా మసీదులో ఎవరు వచ్చినా సమాన ప్రాధాన్యత ఉంటుందని , మసీదు అనేది కేవలం నమాజ్ కు మాత్రమే పరిమితమయ్యే స్థలం కాదన్నారు. ఇక్కడ లభించే ధార్మిక  విద్య , సామాజిక తత్వం , వ్యక్తిత్వ నిర్మాణం  కు దారి తీస్తాయన్నారు. ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ .గౌసుద్దీన్ గ్రామాలలోని ముస్లింలకు ఖురాన్ , హదిస్ ల గురించి వివరించడమే కాకుండా ఏక దైవరాధన , బహు దైవారాధన లపై అవగాహన పరచడం ప్రధాన దేహంగా ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో  ముస్లిం ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు హుస్సేన్ సాహెబ్ , సెంటర్ కమిటీ సభ్యులు షేక్. జానీ మియా, మసీదు కమిటీ సభ్యులు షరీఫ్ , మండల కమిటీ సభ్యులు షాజహాన్, రఫీ, డాక్టర్. హసన్ ,ముస్తఫా, లాల్ మొహమ్మద్ , మధిర మండలం అధ్యక్షులు షేక్. గాలిబ్, ప్రధాన కార్యదర్శి షేక్. సైదులు , ముదిగొండ మండల అధ్యక్షులు మస్తాన్ ఖాన్ , ఉపాధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ , ప్రధాన కార్యదర్శి షేక్. తాజుద్దీన్ ,
వెదుపాలెం మండల అధ్యక్షులు బాసిత్ అలీ , ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !