+91 95819 05907

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 155 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను, అలాగే ఉపాధి కూలీల సౌకర్యార్థం 62 యూనిట్ల పనిముట్లను (పలుగులు, పారలు, తట్టలు) అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ వీరభద్రరావు, ఎక్స్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, సీనియర్ నాయుకులు జూపల్లి రమేష్ మరియు వెలుగు ఆఫీస్ సీ.సీ. వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సర్పంచ్ కుంజా శ్రీను, పంచాయతీ కార్యదర్శి తేజ, ఉప సర్పంచ్ కేరం మంగ, గ్రామదీపిక తిరుపతమ్మ మరియు వార్డు సభ్యులు కోర్స లక్ష్మి, నారం నాగరత్నం, పూనెం రాములు, నారం కనక, నారం లక్ష్మి, నారం సుధాకర్, కుర్సం కృష్ణమూర్తి ఈ పంపిణీలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొడియం కృష్ణవేణి, బీఆర్ఎస్ నాయకులు నారం దిలీప్ కుమార్, అప్పలరాజు, రమేష్‌తో పాటు గ్రామ పెద్దలు వగ్గేల పోలారావు, పూనెం రామలక్ష్మయ్య, పూనెం ప్రవీణ్, కోర్స చలమారావు, వగ్గేల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !