+91 95819 05907

క్రీడలు మానసిక ఉల్లాసానికి నిలయాలు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

​గోపాలపురంలో ఉత్సాహంగా ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్

నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 18: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో గోపాలపురం, గుర్వాయిగూడెం, జమేధారుబంజరు గ్రామాల యువత సంయుక్తంగా నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న మెచ్చా, స్వయంగా వాలీబాల్ ఆడి యువతలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆటలు మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అధికారం ఉన్నా లేకున్నా క్రీడల ప్రోత్సాహానికి, యువత సంక్షేమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కొయ్యల అచ్యుత్ రావు, మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావుతో పాటు దారా యుగంధర్, సోయం వీరభద్రం, మన్నెం అప్పారావు, పాశం ప్రసాద్, యార్లగడ్డ శ్రీను, అశోక్, ఏసు, శ్రీను, రాంబాబు, పిట్టల నవీన్, పానుగంటి గణేష్, లక్కీ, నాని తదితర నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !