రామ్ నరేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన మండల పార్టీ నేతలు.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని వినతి
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్ : దాది చంటి ) జనవరి, 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన కె. రామ్ నరేష్‌ను సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ మాట్లాడుతూ నూతన తహసీల్దార్ ఆధ్వర్యంలో మండలంలోని రెవెన్యూ సమస్యలు వేగంగా పరిష్కారం కావాలని, ముఖ్యంగా సామాన్య ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని కోరారు. దమ్మపేట మండల అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల అమలుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గాజుబోయిన ఏసుబాబు, నియోజకవర్గ విభజన విభాగ అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావుతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.









