+91 95819 05907

ఉన్నత చదువులతోనే సమాజంలో గుర్తింపు: సోయం వీరభద్రం

యువ న్యాయవాది అంకితకు ఘన సన్మానం.. తిరుమలకుంటలో బిఆర్ఎస్ నాయకుల పరామర్శ

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్ : దాది చంటి ) జనవరి, 19: అశ్వరావుపేట నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి నాయకులు సోయం వీరభద్రం సోమవారం మండలంలోని తిరుమలకుంట గ్రామంలో పర్యటించి పలువురు పార్టీ నాయకులను పరామర్శించడంతో పాటు యువ న్యాయవాదిని సత్కరించారు. ఇటీవల ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కొనకళ్ల అంకితను ఆమె స్వగృహం వద్ద సోయం వీరభద్రం ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో గొప్ప గౌరవం లభిస్తుందని, అంకిత న్యాయవాద రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం అంకిత తల్లిదండ్రులు శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులను కూడా ఆయన సత్కరించారు. ఈ పర్యటనలో భాగంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జుజ్జరి వెంకన్నబాబును కలిసి ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుమలకుంట సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన మాడి ముత్యాలరావును పరామర్శించి, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బొల్లికొండ చెన్నారావు, జుజ్జురి సత్యనారాయణ, వాడే వీరస్వామి, పానుగంటి చెన్నారావు, దాసరి రాజా, సిరిబత్తుల శ్రీనివాసరావు, కోర్సా జోగారావు, పలువురు గ్రామస్థులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !