+91 95819 05907

ఇంటికో మహిళ, ఊరికో బండితో కదిలి రావాలి

హైదరాబాద్ లో జనవరి 25-28 వరకు 14వ జాతీయ మహాసభలు

జనవరి 25న ఎన్టీఆర్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ

ఐద్వా జాతీయ మహాసభలను విజయవంతం చేయండి

ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, సీనియర్ నాయకులు మచ్చా మణి.

నేటి గదర్ న్యూస్, వైరా:
ఐద్వా జాతీయ మహాసభ సందర్భంగా జనవరి 25న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు ఇంటికో మహిళా ఊరికో బండితో కదిలి రావాలని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, డివిజన్ నాయకురాలు మచ్చా మణి కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆకాంక్షిస్తూ ఐద్వా వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య నగర్ లో మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జెండాను ఐద్వా సీనియర్ నాయకురాలు పెద్దమళ్ళ పద్మ తిలకం ఎగురవేశారు. ఐద్వా జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో గుడిమెట్ల రజిత, మచ్చా మణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మొదటిసారి జనవరి 25 నుంచి 28 వరకు ఐద్వా జాతీయ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 25న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి మహిళలు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. మహిళల హక్కులు, విద్య, భద్రత, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు తదితర మహిళల అనేక సమస్యలపై ఐద్వా సమరశీల పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని, మహిళలు, యువతులపై వేధింపులు, హత్యలు, లైంగిక దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా జాతీయ మహాసభకు జాతీయ నాయకులు బృందాకారత్, అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి టీచర్, మరియం దావలె, జాతీయ నాయకులు ఎస్.పుణ్యవతి, సుధా సుందర రామన్ హాజరవుతారని, మహిళలు భారీగా హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా డివిజన్ నాయకులు తోట కృష్ణవేణి, బాణాల వెంకట్రావమ్మ, భూక్యా విజయ, చావా కళావతి, మాదినేని రజిని, తాటి కృష్ణకుమారి, తోట పద్మావతి, దేవబత్తిని లక్ష్మితులసి, లైన్స్ క్లబ్ సభ్యురాలు మాదినేని సునిత, కోటేరు మాధవి, ఎనమద్ది సక్కుబాయి, మాయా సింగ్, గుండ్ల కళ్యాణి, నక్క పద్మజ, మాదినేని పద్మ, కుదురుపాక నాగమణి, ఇమ్మడి శైలజ, పొనుగుమాటి అఖిల, మౌనిక, రోజా, భావన, సాహితి, నాళ్ల మాధవి, రత్నకుమారి, విజయ, కుమారి, మహేశ్వరి, వసంత తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !